సీజన్ 4 కు రెడీ అవుతోన్న "మహారాణి" వెబ్ సిరీస్

సూపర్ హిట్ వెబ్ సిరీస్ "మహారాణి" ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రీమియర్‌కి సిద్ధమవుతోంది. క్రేజీ బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సీజన్ త్వరలోనే ‘సోనీ లివ్’ లో వీక్షించేందుకు అందుబాటులోకి రానుంది. తాజాగా.. సిరీస్ క్రియేటర్లు అధికారిక టీజర్‌ను విడుదల చేశారు.
మహారాణి కథానాయిక రాణి భారతి (హుమా ఖురేషి) ఒక సాధారణ గృహిణిగా ప్రారంభమై.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరిస్తుంది ఈ సిరీస్ . రాజకీయ కుతంత్రాలు, నమ్మకద్రోహాలు, అధికార పోరాటాల మధ్య ఆమె ఎలా ముందుకు సాగిందన్నదే ఈ వెబ్ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.
మూడో సీజన్‌కు కొనసాగింపుగా రాబోయే "మహారాణి సీజన్ 4" మరింత హోరాహోరీగా ఉండనున్నట్లు అంచనా. తాజాగా విడుదలైన టీజర్ లో రాణి భారతి బీహార్ ప్రజల రక్షణ కోసం ఏమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా కనిపిస్తుంది. ఈ టీజర్‌లో హుమా ఖురేషి చెప్పిన శక్తివంతమైన మోనోలాగ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ, నాలుగో సీజన్‌పై భారీ అంచనాలు నెలకొల్పుతోంది.
-
Home
-
Menu