ఓటీటీ లోకి 'లిటిల్ హార్ట్స్'

ఓటీటీ లోకి లిటిల్ హార్ట్స్
X
తక్కువ బడ్జెట్‌తో వచ్చినా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసిన సినిమా 'లిటిల్ హార్ట్స్'. సాయి మార్తాండ్ దర్శకత్వంలో, ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో మౌళి తనూజ్, శివాని నాగారం జంటగా నటించారు.

రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ.39 కోట్ల వరకూ గ్రాస్ సాధించి సంచలనంగా నిలిచింది. కేవలం యువ నటీనటులు, సింపుల్ లొకేషన్లతో తెరకెక్కినా, కథలోని నిజాయితీ ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేసింది. ప్రత్యేకంగా టీనేజ్ లవ్ స్టోరీలో పేరెంట్స్, చదువు, ప్రేమల మధ్య సంఘర్షణను దర్శకుడు సరదాగా చూపించడం సినిమాకి విజయం తెచ్చింది.

ప్రస్తుతం థియేటర్ల రన్‌ను ముగించిన 'లిటిల్ హార్ట్స్' అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. దసరా కానుకగా విడుదలయ్యే ఈ వెర్షన్‌లో కొన్ని కొత్త సన్నివేశాలు కూడా జోడించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Tags

Next Story