ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎల్ 2 : ఎంపురాన్’

ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎల్ 2 : ఎంపురాన్’
X
ఈ భారీ చిత్రం నేటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింవది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు.

పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన మోహన్‌లాల్ నటించిన “ఎల్పి2: ఎంపురాన్” మూవీ, మార్చి 27న థియేటర్లలో విడుదలయ్యింది. విడుదల తర్వాత మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, కొన్ని వివాదాల మధ్యలోనూ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 265 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు చేసి, మాలీవుడ్ లో సరికొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఈ భారీ చిత్రం నేటి నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింవది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషలతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్స్ లో చూసే అవకాశాన్ని మిస్ అయినవారు ఇప్పుడు ఈ యాక్షన్ చిత్రాన్ని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. అయితే, హిందీ వెర్షన్ డిజిటల్ ప్రీమియర్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, టోవినో థామస్, అభిమన్యు సింగ్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సంగీతాన్ని దీపక్ దేవ్ అందించారు. పాలిటిక్స్, యాక్షన్, మిస్టరీల మేళవింపుతో రూపొందిన “ఎల్పి2: ఎంపురాన్” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉండటం ప్రేక్షకులకు ఒక గొప్ప అవకాశం.

Tags

Next Story