ఓటీటీలోకి ‘కుబేర, భైరవం’!

ఓటీటీలోకి ‘కుబేర, భైరవం’!
X
గడిచిన రెండు నెలల్లో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న చిత్రాలలో 'కుబేర, భైరవం' కూడా ఉన్నాయి. ఈ సినిమాలు రెండూ ఈ రోజు (జూలై 18) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి.

గడిచిన రెండు నెలల్లో టాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న చిత్రాలలో 'కుబేర, భైరవం' కూడా ఉన్నాయి. ఈ సినిమాలు రెండూ ఈ రోజు (జూలై 18) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. ఫీల్‌గుడ్ మూవీస్ స్పెషలిస్ట్‌గా పేరొందిన శేఖర్ కమ్ముల రూపొందించిన ‘కుబేర’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఘన విజయం సాధించింది. శేఖర్ కమ్ముల స్టైల్ మేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

ఇక మల్టీస్టారర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘భైరవం’ జీ5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశారు. మాస్ అంశాలతో నిండి ఉన్న ఈ చిత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలమైంది. అదితి శంకర్, ఆనంది కూడా కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ రెండు సినిమాలు థియేటర్లలో మిస్ చేసినవారికి ఓటీటీలో చూసే మంచి అవకాశం వచ్చింది. ఒకటి ఎమోషనల్ డ్రామా, మరొకటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఇప్పుడు ఓటీటీలో వీటికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సిందే!

Tags

Next Story