ఓటీటీలో ‘కింగ్డమ్’ హిట్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన 'కింగ్డమ్' భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మంచి ఓపెనింగ్ సాధించినా, లాంగ్ రన్ లో నిరాశపరిచింది. అయితే ఈ చిత్రం ఓటీటీలో మాత్రం సంచలనంగా మారింది.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కింగ్డమ్' ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించింది. ఓర్మాక్స్ మీడియా ప్రకారం రెండు వారాల్లోనే 5.9 మిలియన్ వ్యూస్ సాధించి డిజిటల్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చూపించింది. బాలీవుడ్ చిత్రాలు 'మెట్రో ఇన్ ఇండియా, మాలిక్, ఇన్‌స్పెక్టర్ జెండే' వంటి వాటిని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలవడం విశేషం.
విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం ఈ సినిమాకు బలాన్నిచ్చాయి. థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో ఈ స్థాయి విజయాన్ని సాధించడం రౌడీ ఫ్యాన్స్‌కి గర్వకారణంగా మారింది.
-
Home
-
Menu