‘కన్నప్ప‘ ఓటీటీ డేట్ ఫిక్స్

‘కన్నప్ప‘ ఓటీటీ డేట్ ఫిక్స్
X
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుని ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన డివోషనల్ డ్రామా ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి ఓపెనింగ్స్ అందుకుని ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కన్నప్ప' సినిమాలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్‌ నటించగా.. అతిథి పాత్రల్లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. ప్రభాస్ రుద్ర పాత్రలో చేసిన స్పెషల్ అప్పియరెన్స్‌, రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన వంటి హైలైట్స్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేటెస్ట్ గా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘కన్నప్ప‘ స్ట్రీమింగ్‌కి రాబోతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది. థియేటర్లలో విడుదలైన 69 రోజుల తర్వాత ఇప్పుడు ‘కన్నప్ప‘ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతుంది.



Tags

Next Story