కాధలిక్క నేరమిల్లై' త్వరలో ఓటీటీలోకి!

X
తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం "కాధలిక్క నేరమిల్లై" రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి మోహన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కిరుతిగా ఉదయనిధి దర్శకత్వం వహించగా, సంగీతాన్ని ఏ.ఆర్. రెహ్మాన్ అందించారు. 2025 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ స్పందన అందుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారికి ఇది మంచి ఛాన్స్.
వినయ్ రాయ్, యోగి బాబు వంటి నటులు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. కథలో కొంత భాగం 2010లో విడుదలైన అమెరికన్ రొమాంటిక్ కామెడీ "ది స్విచ్" నుండి ప్రేరణ పొందినట్టు తెలుస్తోంది.
Next Story
-
Home
-
Menu