నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోన్న‘జురాసిక్ వరల్డ్ సీజన్ 3’

నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తోన్న‘జురాసిక్ వరల్డ్ సీజన్ 3’
X

నెట్‌ఫ్లిక్స్ లో అత్యధికంగా.. ఎదురు చూస్తున్న జురాసిక్ వరల్డ్: ఖయాస్ థియరీ మూడో సీజన్‌ను ఏప్రిల్ 3, 2025న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జురాసిక్ వరల్డ్: క్యాంప్ క్రెటేషస్ సంఘటనల తర్వాత జరుగుతున్న ఈ కథలో, నుబ్లార్ సిక్స్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఒక కుట్రను వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు, ఇది మానవాళికి, డైనోసార్లకు చాలా ప్రమాదకరమైంది.

సీజన్ 2లో, ఓ భయంకరమైన తుఫాను నుంచి తప్పించుకున్న నుబ్లార్ సిక్స్ స్వయంగా సెనెగల్ దేశంలో ఉంటారు. అయితే, డైనోసార్లు ఉన్న ఓడను వదిలిపెట్టారని వారికి అర్థమవుతుంది. అక్కడ అమినతా, జైనా మబ్లోస్ అనే రైతు కుటుంబాన్ని కలుస్తారు. అయితే, అదే సమయంలో ఒక సుచోమిమస్ డైనోసార్ వీరిపై దాడికి దిగుతుంది.

ఇప్పటికే అందరూ తమ అసలు రంగు బయటపెట్టడంతో, మూడో సీజన్ మరింత ఉత్కంఠభరితంగా ఉండనుంది. బ్రూక్‌లిన్ ఇప్పుడు సోయోనా శాంటోస్ నెట్వర్క్‌ను పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యంతో ఉంది. అయితే, నుబ్లార్ సిక్స్ గుంపు ఇంకా ఆమెను విశ్వసించలేకపోతున్నారు. సీజన్ 2 చివర్లో జరిగిన అతిపెద్ద ట్విస్ట్ కు సమాధానం రాబోతోంది! మరి, బ్రూక్‌లిన్ నిజంగా శాంటోస్‌తో చేతులు కలిపిందా? లేదా తనదైన పద్ధతిలో ప్రపంచాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తుందా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఏప్రిల్ 3, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న జురాసిక్ వరల్డ్: ఖయాస్ థియరీ సీజన్ 3లో తెలుస్తుంది!

Tags

Next Story