‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 లో విలన్ ఇతడేనా?

సక్సెస్ పుల్ ఫిల్మ్ మేకర్ ద్వయం రాజ్ అండ్ డీకే సృష్టించిన ఐకానిక్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్’. గత రెండు సీజన్లలోనూ ఈ సిరీస్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. గతేడాది ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్‌కి సంబంధించి మూడో సీజన్ రాబోతుందనే ప్రకటనతో మేకర్స్ అభిమానులను ఖుషీ చేశారు మేకర్స్ . ప్రముఖ నటుడు, ‘పాతాళ్ లోక్’ సిరీస్ ఫేమ్.. జైదీప్ అహ్లావత్ ఈ సీజన్‌లో కీలక పాత్రలో కనిపించ నున్నారని వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. ఆయన ఈ సిరీస్ లో ప్రతినాయకుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.
జైదీప్ అహ్లావత్ ‘ది ఫ్యామిలీ మాన్’ సీజన్ 3లో నటిస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి, ఆయన పాత్ర గురించి ప్రతీ అప్డేట్ తెలుసుకోవాలని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. జైదీప్ పాత్రకు సీజన్ 3లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆయన పాత్ర మనోజ్ బాజ్‌పేయి శ్రీకాంత్ పాత్రతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతుందని సమాచారం. వీరిద్దరి పెర్ఫార్మెన్స్ తో తెరమీద ఇద్దరు లెజెండ్స్ ఎనర్జీని ఆస్వాదించనున్నారు ఆడియన్స్.
‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 3 షూటింగ్ లేటెస్ట్ గా పూర్తయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవడానికి చాలా నెలల టైమ్ పడుతుంది. బహుశా దీపావళి 2025 నాటికి సిరీస్ విడుదల అవచ్చు అని వినికిడి. మరి సీజన్ 3 కు జైదీప్ పాత్ర ఏ రేంజ్ లో అడ్వాంటేజ్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu