ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘హిట్ 3’

నేచురల్ స్టార్ నాని నటించిన ఇటీవల యాక్షన్ థ్రిల్లర్ ‘హిట్ 3’. నానీ కెరీర్‌లో ఇది అత్యంత హింసాత్మక చిత్రం. అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లుచేసి.. అతని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టి.. వరుస వైఫల్యాల తర్వాత ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.
ఇతర తెలుగు చిత్రాల మాదిరిగానే ‘హిట్ 3’ కి కూడా నాలుగు వారాల థియేట్రికల్ విండో ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఈ ఫుల్-బ్లో యాక్షన్ ఎంటర్‌టైనర్ మే 29 నుంచి స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. స్ట్రీమింగ్ తేదీని సోషల్ మీడియాలో పంచుకోలేదు కానీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోని ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో పేర్కొన్నారు.
‘హిట్ 3’ మూవీ ఆ తేదీ నుంచి బహుళ భాషల్లో ప్రీమియర్ కానుంది. ఈ సినిమా కన్నడ నటి శ్రీనిధి శెట్టికి తొలి టాలీవుడ్ ఎంట్రీ చిత్రం. ఈ క్రైమ్ డ్రామాని నానీ మరియు ప్రశాంతి తిపిర్నేని కలిసి వాల్ పోస్టర్ సినిమా మరియు యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ కింద నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఇంకెంతగా ప్రజాదరణ పొందుతుందో చూడాలి.
-
Home
-
Menu