ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘హిట్ 3‘

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ‘హిట్ 3‘
X
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3‘.. తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కు ఓ బెంచ్ మార్క్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3‘.. తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కు ఓ బెంచ్ మార్క్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ‘దసరా‘ తర్వాత నాని నుంచి వంద కోట్ల క్లబ్ లో చేరిన మరొక చిత్రం ‘హిట్ 3‘.

వాల్ పోస్టర్ సినిమా పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపుర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. అడవి శేష్, కార్తీ అతిథి పాత్రల్లో మురిపించారు.

‘హిట్‘ సిరీస్ లోనే అత్యంత భారీ విజయాన్ని సాధించిన ‘హిట్ 3‘ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతుందట. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా.. జూన్ 5 నుంచి ‘హిట్ 3‘ స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Next Story