ఓటీటీలోకి వచేస్తున్న హరిహర వీరమల్లు

ఓటీటీలోకి వచేస్తున్న హరిహర వీరమల్లు
X
ముందే స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈ మూవీ ఆగస్టు 22, 2025 నుంచి స్ట్రీమింగ్ షురూ అవుతుందని అనౌన్స్ చేసింది.

“హరిహర వీరమల్లు” గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయ్యి, ఓపెనింగ్ వీకెండ్ తర్వాత స్పీడ్ తగ్గింది . పవన్ కళ్యాణ్ కమ్‌బ్యాక్ మూవీగా భారీ హైప్ ఉన్నా.. సెకండ్ హాఫ్ డల్‌గా సాగడం, విజువల్ ఎఫెక్ట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది.

ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్‌ వద్ద బంపర్ కలెక్షన్స్‌తో కిక్‌స్టార్ట్ అయినా, నెగెటివ్ రివ్యూలు, నెగటివ్ టాక్ వైరల్ అవ్వడంతో బాక్సాఫీస్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. అందుకే నిర్మాతలు నాలుగు వారాల్లోనే ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ముందే స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈ మూవీ ఆగస్టు 22, 2025 నుంచి స్ట్రీమింగ్ షురూ అవుతుందని అనౌన్స్ చేసింది.

ఈ పీరియడ్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక డేరింగ్ థీఫ్‌గా కనిపిస్తూ, ఔరంగజేబు పోర్ట్ నుంచి కోహినూర్ డైమండ్‌ని స్వాహా చేసే మిషన్‌లో ఉంటాడు. సనాతన ధర్మం థీమ్‌ని కూడా టచ్ చేస్తూ సాగే ఈ స్టోరీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసింది. మరి ఈ మూవీ ఓటీటీ లో అయినా మేజిక్ చేస్తుందో లేదో చూడాలి.

Tags

Next Story