‘హరిహర వీరమల్లు’ ఓటీటీలో ఎప్పుడంటే.. !

X
సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగస్టు 22, 2025న, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్-ఇండియన్ సినిమా ‘హరిహర వీరమల్లు’ అభిమానులను నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా ఆగస్టు 22, 2025న, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. బహుభాషా డిజిటల్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.
అయితే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుండి ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించగా, బాబీ డియోల్, నాసర్, సునీల్, దలీప్ తాహిల్, ఆదిత్య, సచిన్ ఖేడేకర్ తదితరులు తారాగణంలో ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా, ఎ. దయాకర్ రావు, ఎఎమ్ రత్నం నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు.
Next Story
-
Home
-
Menu