ఓటీటీలోకి ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్

ఓటీటీలోకి ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ చేంజర్’ ఈ ఏడాది సంక్రాంతి (జనవరి 10) సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. భారీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉన్నప్పటికీ.. అభిమానులు దాని హిందీ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం, ‘గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ మార్చి 7 నుంచి ప్రత్యేకంగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకు వివేక్ వెల్మురుగన్ స్క్రీన్‌ప్లే అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. కథను కార్తిక్ సుబ్బరాజ్ అందించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అంజలి, కియారా అద్వానీ హీరోయిన్స్ గా నటించగా.. ఎస్. జే. సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరాం, సముద్రఖని తదితరులు నటించారు. థమన్ సంగీతాన్ని అందించారు.

మొత్తం మీద, ‘గేమ్ చేంజర్’ థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను మార్చి 7 నుంచి జీ5లో ఆస్వాదించవచ్చు.

Tags

Next Story