బాక్సాఫీస్ విజయం నుంచి ఓటీటీ రికార్డు వరకు!

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుని, ఇప్పుడు ఓటీటీ లో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 31, 2024న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధించింది.
ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డులు బద్దలు కొడుతోంది. నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చిన ఈ చిత్రం వరుసగా 13 వారాల పాటు నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్‌లో నిలిచి, ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల వీక్షణలతో, 15 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
బ్యాంకింగ్ రంగాన్ని ఆధారంగా చేసుకుని, ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి తన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడే క్రమంలో చేసిన ప్రయత్నాలు ఈ సినిమా కథాంశం. దుల్కర్ సల్మాన్ పోషించిన భాస్కర్ కుమార్ పాత్ర, వెంకీ అట్లూరి కథన శైలి, జి.వి. ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం కలగలసి ఈ సినిమాకి పెద్ద విజయాన్ని అందించాయి. 'లక్కీ భాస్కర్' నెట్‌ఫ్లిక్స్ రికార్డుపై నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది
-
Home
-
Menu