సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ !

సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ !
X
ఈ మూవీ అనూహ్యంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే జనవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

సౌత్ బ్యూటీ వేదిక ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఫియర్‌’. ఈ మూవీ అనూహ్యంగా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే జనవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. డాక్టర్ హరిత గోగినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఆర్ అభి దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా 2023 డిసెంబర్ 14న థియేటర్లలో విడుదలై... విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా, విడుదలకు ముందే 60 కు పైగా అంత ర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుని ఒక రికార్డ్ సాధించింది.

సింధు (వేదిక) అనే యువతి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతుండే పాత్రలో కనిపిస్తుంది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ఊహించుకుంటూ, తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుందీ అమ్మాయి. తాను ప్రేమించిన వ్యక్తి సంపత్ (అరవింద్ కృష్ణ) దూరం కావడం, చెల్లి ఇందుతో తగాదాలు, తల్లిదండ్రులతో విభేదాలు ఆమె జీవితాన్ని మరింత చీకటిలోకి నెడతాయి. సింధు తన సమస్యల నుంచి బయటపడిందా? ఆమె జీవితంలో వచ్చే మలుపులు ఏమిటి? అనే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలంటే ‘ఫియర్‌’ చూడాల్సిందే.

ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, జయప్రకాశ్ (జెపి), పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థ్రిల్లర్ అంశాలు, హారర్ ఎలిమెంట్స్‌తో పాటు తల్లిదండ్రుల బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి సమాజంలో చర్చించాల్సిన అంశాలను ఈ సినిమాలో చక్కగా చూపించారు.

Tags

Next Story