‘ఫర్జీ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ అప్పటి నుంచే !

‘ఫర్జీ 2’ వెబ్ సిరీస్ షూటింగ్ అప్పటి నుంచే !
X
షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ మధ్య ఘర్షణతో ముగిసింది మొదటి భాగం. రెండవ భాగంపై ఆసక్తిని రేకెత్తించింది. తాజా సమాచారం ప్రకారం.. "ఫర్జీ 2" డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

2023లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన "ఫర్జీ" వెబ్ సిరీస్‌తో లాంగ్ ఫార్మాట్ కథనంలోకి అడుగుపెట్టాడు షాహిద్ కపూర్. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ మధ్య ఘర్షణతో ముగిసింది మొదటి భాగం. రెండవ భాగంపై ఆసక్తిని రేకెత్తించింది. తాజా సమాచారం ప్రకారం.. "ఫర్జీ 2" డిసెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది.

రాజ్ అండ్ డీకే ప్రస్తుతం "రక్త బ్రహ్మాండ్"తో బిజీగా ఉన్నారు. దానిని పూర్తి చేసిన తర్వాత.. "ఫర్జీ 2" ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలుపెడతారు. షాహిద్ కపూర్‌తో కథ గురించి చర్చలు జరిగాయి. ఈ సీక్వెల్‌లో షాహిద్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. "ఫర్జీ 2" 2026 రెండవ భాగంలో విడుదల కానుంది. ఫర్జీ 2కి ముందు, షాహిద్ "కాక్‌టైల్ 2" చిత్రీకరణను పూర్తి చేస్తారు . ఇంకా మరో సినిమా కోసం స్క్రిప్ట్‌లను పరిశీలిస్తున్నాడు.

Tags

Next Story