ఓటీటీలోకి ‘డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే !

ఓటీటీలోకి ‘డ్రాగన్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే !
X

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్రాగన్' తమిళ చిత్రం ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలై.. సక్సెస్ ఫుల్ రన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మార్చి 21 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌కు రానుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

'డ్రాగన్' చిత్రం డి. రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్) అనే యువకుడి కథను వివరిస్తుంది. ఇంటర్మీడియట్‌లో 96% మార్కులు సాధించిన రాఘవన్, ప్రేమలో విఫలమై, బ్యాడ్ బాయ్‌గా మారి, ఇంజనీరింగ్‌లో 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తో ప్రేమలో పడిన రాఘవన్, ఆమెతో బ్రేకప్ తర్వాత జీవితంలో సక్సెస్ సాధించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవాలు ఏంటన్నది మిగతా కథ.

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా.. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా కనిపించారు. కె.ఎస్. రవి కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

'డ్రాగన్' చిత్రం విడుదలైన మొదటి 15 రోజుల్లోనే ఇండియాలో రూ.84.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.124.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో రూ.68.25 కోట్ల నెట్, తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

Tags

Next Story