ఒటీటీలో అదరగొడుతున్న ‘డిటెక్టివ్ ఉజ్వలన్’

ఒటీటీలో అదరగొడుతున్న ‘డిటెక్టివ్ ఉజ్వలన్’
X
‘డిటెక్టివ్ ఉజ్వలన్’ మలయాళ సినిమా జూలై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ధ్యాన్ శ్రీనివాసన్ నటించిన ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ మలయాళ సినిమా జూలై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంద్రనీల్ గోపీకృష్ణన్, రాహుల్ జి అనే కొత్త దర్శకులు తెరకెక్కించిన ఈ మిస్టరీ కామెడీ థ్రిల్లర్‌లో ధ్యాన్.. ఉజ్వలన్‌గా అదరగొట్టాడు. ఒక గ్రామంలో జరిగే వరుస క్రైమ్‌లను ఛేదించే అమెచ్యూర్ డిటెక్టివ్‌గా ఆయన పాత్ర ఉంటుంది. ఈ సినిమా, టోవినో థామస్ నటించిన ‘మిన్నల్ మురళి’ తో మొదలైన వీకెండ్ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండో భాగంగా నిలుస్తుంది.

మే 23న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. విమర్శకులు, సాధారణ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలను అందుకుంది. ‘డిటెక్టివ్ ఉజ్వలన్’ మూవీలో సిజు విల్సన్, రోనీ డేవిడ్ రాజ్, కొట్టాయం నజీర్, సీమా జి నాయర్, కలభవన్ నవాస్, నిర్మల్ పాలాలీ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే, సోషల్ మీడియా స్టార్స్ అయిన అమీన్, నిహాల్ నిజామ్, నిబ్రాస్ నౌషాద్, షాహుబాస్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

సోఫియా పాల్ నిర్మాణంలో.. వీకెండ్ బ్లాక్‌బస్టర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. థియేటర్స్ లో అద్భుతంగా అలరించిన ఈ సినిమా ఓటీటీలో ఇంకెంతగా ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.



Tags

Next Story