ట్రెండింగ్ లో దూసుకెళ్తున్న 'డాకు మహారాజ్'!

X
సోషల్ మీడియాలో ఇప్పుడు 'డాకు మహారాజ్' ఫుల్ ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. అందుకు ప్రధాన కారణం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో సంచలనం సృష్టిస్తుండడమే. ఈ సినిమా భారతదేశంలో నంబర్ 1 గా నిలవడంతో పాటు పలు దేశాల్లోనూ మంచి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుంది. బాలకృష్ణ నటన, తమన్ ఇచ్చిన బాణీలు, బాబీ దర్శకత్వానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
మరోవైపు మలయాళం ప్రేక్షకుల నుంచి 'డాకు మహారాజ్'కి విపరీతమైన అప్లాజ్ వస్తోంది. బాలయ్య గత చిత్రం 'భగవంత్ కేసరి'కి కూడా మాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు 'డాకు మహారాజ్'కి ఓటీటీలో మలయాళం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. మొత్తంగా విడుదలై నెలన్నర రోజులు దాటినా ఇప్పుడు ఓటీటీలో రిలీజైనా నేపథ్యంలో 'డాకు మహారాజ్' మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది.
Next Story
-
Home
-
Menu