నెట్‌ఫ్లిక్స్ లో దూసుకెళ్తున్న 'కోర్ట్'!

తెలుగు ఇండస్ట్రీ ఎక్కువగా కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపుతుంది. అయితే ఈమధ్య కాలంలో అన్ని తరహా జానర్లతోనూ మురిపిస్తుంది. అలా ఆద్యంతం కోర్ట్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'కోర్ట్'. సాంఘిక బాధ్యత కలిగిన కథనంతో, ఆసక్తికరమైన కోర్ట్ రూమ్ డ్రామాగా ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
న్యాయవ్యవస్థలో సామాన్యుడి స్వరాన్ని ప్రతిబింబించేలా సాగిన కథనం, ప్రేక్షకుల మనసులను తాకింది. వ్యక్తిగత బాధను సామాజిక ప్రశ్నగా మారుస్తూ, చట్టం ముందు ప్రతి మనిషి సమానమనే అంశాన్ని ఈ సినిమా గట్టిగా వినిపించింది. నేచురల్ స్టార్ నాని తన హోం బ్యానర్ ద్వారా నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితాలను నమోదు చేసింది.
దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమాకు మెరుగైన నెరేషన్ అందించగా, సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇప్పటికే థియేటర్లలో సూపర్ హిట్టైన 'కోర్ట్' ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది. ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చిన ఈ చిత్రం, నాన్-ఇంగ్లీష్ విభాగంలో గ్లోబల్ టాప్ 5 ట్రెండింగ్ మూవీస్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.
లేటెస్ట్ గా భార్యాభర్తలు శరత్ కుమార్, రాధిక శరత్ కుమార్ 'కోర్ట్' చిత్రాన్ని ప్రత్యేకంగా అభినందించారు. '‘కోర్ట్’ సినిమా చూశాము. నిజంగా అద్భుతమైన చిత్రం. సమాజానికి అత్యవసరమైన సందేశాన్ని అందించే కథనంతో ఇది అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా ముఖ్యంగా యువత, కౌమార దశ, తల్లిదండ్రుల బాధ్యత, మరీ ముఖ్యంగా న్యాయవ్యవస్థపై అవగాహన అనే అంశాలపై దృష్టి సారించింది.' అంటూ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు రాధిక మరియు శరత్ కుమార్.
Great appreciation for this movie, to the technicians and actors. Enjoyed the movie, pls watch it👍👍👍@NameisNani I am aware it’s yr production , well done.🙏 https://t.co/yGx5zGMuDR
— Radikaa Sarathkumar (@realradikaa) April 17, 2025
-
Home
-
Menu