ఓటీటీలోకి రాబోతున్న రజనీకాంత్ ‘కూలీ’

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కూలీ’. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా అప్పుడే .. ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత, సెప్టెంబర్ రెండో వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, ఈ సినిమా కేవలం మోస్తరు విజయంగానే పరిగణించబడుతోంది.
తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన కారణంగా థియేట్రికల్ రన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ రజనీకాంత్ స్టార్ పవర్ ఈ భారీ కలెక్షన్‌ను సాధించింది. ఓటీటీ రిలీజ్‌తో ఈ సినిమా కొత్త ఊపిరి పోసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లని ప్రేక్షకుల కోసం. స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రైమ్ వీడియో.. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన “కూలీ” లో రజనీకాంత్ డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. శృతి హాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. రజనీకాంత్ సినిమాలు సాధారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో హై వ్యూయర్‌షిప్ సాధిస్తాయి కాబట్టి.. థియేట్రికల్‌లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, “కూలీ” ఓటీటీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మరి ‘కూలీ’ ఓటీటీలో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
-
Home
-
Menu