ఓటీటీలోకి వివాదాత్మక సినిమా !

దక్షిణ భారత సినిమా సాధారణంగా సంప్రదాయ విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వింతపోకడలకు, అసాధారణమైన భావనలను స్పృశించడంలో ఈ పరిశ్రమ పెద్దగా ముందుకు రావడం లేదు. అలాంటి అంశాల్లో ఒకటి స్వలింగ ప్రణయం, వారి వివాహం. ఇటీవల తమిళంలో రూపొందిన "కాదల్ ఎన్బదు పొదు ఉడమై" అనే చిత్రం ఈ సబ్జెక్ట్‌ను స్పృశించింది. రోహిణి, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇద్దరు లెస్బియన్ల మధ్య జరిగే భావోద్వేగ కథను అందించింది.
గత నెల విడుదలైన ఈ సినిమా టీజర్ ఇప్పటికే సంచలనం రేపింది. దక్షిణ భారత సినిమాలో లెస్బియన్ ప్రేమకథలు చాలా అరుదుగా ఉంటాయి. అదే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ చిత్రం టెన్కోట్టా ఓటీటీ వేదికపై ప్రసారం కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాలో ఇద్దరు కథానాయికలు బలమైన పాత్రలు పోషించడమే కాకుండా.. సంప్రదాయ కుటుంబ వ్యవస్థలో అలాంటి ప్రేమకథలు ఎలా ఎదుర్కొంటాయనే అంశాన్ని కూడా ప్రస్తావించింది.
ఈ సినిమా ఓటీటీలో ప్రదర్శితమవుతున్నప్పటి నుండి విభిన్నమైన అభిప్రాయాలను రాబట్టింది. అయితే.. ఈ చిత్రం ప్రేక్షకులలో మరింత చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. సమాజంలో తక్కువగా చర్చకు వచ్చే ఇతివృత్తాన్ని స్పృశించడం, దానికి అనుకూలం, ప్రతికూలం అనే భిన్న స్పందనలు రావడం సహజం. సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
-
Home
-
Menu