ఓటీటీ కంటే ముందే టీవీలో వచ్చేస్తోంది!

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో మంచి ఆక్యుపెన్సీని కొనసాగిస్తోంది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే ఆసక్తి పెరిగింది.
అయితే 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జీ తెలుగు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ‘మళ్లీ సంక్రాంతి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఓటీటీ కన్నా ముందే టెలివిజన్ ప్రీమియర్‌గా 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదలవుతుందని హింట్ ఇచ్చింది.
ఈ నిర్ణయం వెనుక వ్యూహం స్పష్టంగా ఉంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాని టీవీలో ముందుగా ప్రసారం చేస్తే టీఆర్‌పీ రేటింగ్స్ పెరిగే అవకాశం ఉందని జీ నిర్వహకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడనే దానిపై ఇంకా స్పష్టత లేదు
-
Home
-
Menu