ఈ రెండు వెబ్ సిరీస్ లు రికార్డులు బ్రేక్ చేశాయి !

ఈ రెండు వెబ్ సిరీస్ లు రికార్డులు బ్రేక్ చేశాయి !
X
టీనేజ్ డ్రామా నుండి హై-స్టేక్స్ ఎస్పియోనేజ్ వరకు విభిన్నమైన కథాంశాలను ఆస్వాదించే ప్రేక్షకులు కొత్త ప్రయోగాలను కూడా స్వాగతిస్తున్నారు.

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో తన రెండు భారీ గ్లోబల్ సక్సెస్ లతో స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. 2024లో అత్యంత ప్రాచుర్యం పొందిన టాప్-10 అన్యభాషా షోలలో ఒకటిగా నిలిచింది సిటాడెల్: హనీ బన్నీ. ప్రఖ్యాత సిటాడెల్ బ్రాండ్‌కు చెందిన భారతీయ వెర్షన్ ఇది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రలు పోషించారు. గూఢచారి ప్రపంచాన్ని ఆవిష్కరించే ఈ కథ ప్రేక్షకులను ముగ్ధులను చేస్తూ, భారతీయ కథన శైలికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చింది.

ఇదే సమయంలో, ఇండియాలో ‘మిర్జాపూర్’ 3వ సీజన్ మరో సంచలన రికార్డును సృష్టించింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఈ క్రైమ్ డ్రామా ప్రైమ్ వీడియో ఇండియాలో ప్రసారం అయిన వారాంతంలోనే అత్యధికంగా వీక్షించబడిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. ప్రతీ సీజన్‌తో మరింత బలపడుతూ వస్తున్న ‘మిర్జాపూర్’ వెబ్ సిరీస్ ఇండియన్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లింది.

‘సిటాడెల్: హనీ బన్నీై’, దాని ఇటాలియన్ వెర్షన్ ‘సిటాడెల్: డయానా’ విజయాన్ని బట్టి చూస్తే.. సిటాడెల్ యూనివర్స్ భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు.. టీనేజ్ డ్రామా నుండి హై-స్టేక్స్ ఎస్పియోనేజ్ వరకు విభిన్నమైన కథాంశాలను ఆస్వాదించే ప్రేక్షకులు కొత్త ప్రయోగాలను కూడా స్వాగతిస్తున్నారు. ఈ అంతర్జాతీయ హిట్ షోలు, టాప్ చార్ట్‌లను ఆక్రమిస్తాయా? లేదా కొత్తమైన ప్రాజెక్టులు వాటిని అధిగమిస్తాయా? డిజిటల్ ప్రపంచంలో వచ్చే పెద్ద సంచలనం ఏదో తెలియాలంటే ఇంకాస్త ఎదురుచూడాల్సిందే!

Tags

Next Story