ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం!

ఓటీటీలోకి బాక్సాఫీస్ సంచలనం!
X

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రం 'ఛావా'. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, సౌత్ క్యూటీ రష్మిక జంటగా నటించిన ఈ హిస్టారికల్ డ్రామాను లక్ష్మణ్ ఉటేకర్ అద్భుతంగా ఆవిష్కరించాడనే ప్రశంసలు దక్కాయి.

'ఛావా' హిందీలోనే కాకుండా తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయగా, ఇక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తుంది. హిస్టారికల్ జానర్‌ను అభిమానించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా గ్రాండ్ విజువల్స్, కథనం, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

భారీ విజయాన్ని సాధించిన 'ఛావా' ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 11 నుంచి 'ఛావా' ఓటీటీలో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి రానుందట. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story