దర్శకుడిగా బోమన్ ఇరాని తొలి ప్రయత్నం.. డైరెక్ట్ గా ఓటీటీలోకి చిత్రం

బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ బోమన్ ఇరాని తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం "ది మెహతా బాయ్స్". విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. జనవరి 23న బోమన్ ఇరాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. "48 గంటలు, ఇద్దరు వ్యక్తులు, ఒక అపురూపమైన కథ" అంటూ ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ పోస్ట్ షేర్ చేశారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 20న 15వ చికాగో సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ ప్రీమియర్ జరుపుకుంది.
ఈ చిత్రంలోని నటనకు గానూ బోమన్ ఇరాని అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌత్ ఆసియా , టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ మేల్ అవార్డు పొందారు. చికాగో సౌత్ ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సౌత్ ఆసియన్ ఫిల్మ్ అసోసియేషన్ అవార్డుతో ఆయన్ని సత్కరించారు. "ది మెహతా బాయ్స్" తండ్రీ-కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని కళ్లకు కట్టించేలా చూపిస్తుంది. వీరిద్దరూ పరస్పరం అవగాహన లేని పరిస్థితుల్లో ఉంటారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా 48 గంటల పాటు కలిసి గడపాల్సి వస్తుంది.
ఈ చిత్రాన్ని బోమన్ ఇరాని, అలెక్స్ డినెలారిస్ రచించారు. బోమన్ ఇరాని, అవినాష్ తివారీతో పాటు శ్రేయ చౌదరి, పూజా సరూప్ కీలక పాత్రలు పోషించారు. ఈ భావోద్వేగ భరిత కథ ప్రేక్షకుల మనసులను కదిలిస్తుందని ఆశిద్దాం.
-
Home
-
Menu