ఓటీటీలో అదరగొడుతోన్న మరో మలయాళ థ్రిల్లర్ !

ఓటీటీలో అదరగొడుతోన్న మరో మలయాళ థ్రిల్లర్ !
X

లాస్టియర్ మలయాళంలో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘ఆనంద్ శ్రీబాల’. ఈ చిత్రం జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటిటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘నైట్ డ్రైవ్, మాళికప్పురం’ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న రైటర్ అభిలాష్ పిళ్ళ ఈ సినిమాకు మంచి కథను అదించాడు. విష్ణు వినయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్ లీడ్ రోల్ లో నటించాడు. అపర్ణాదాస్, సంగీత మాధవన్ నాయర్, సైజు కురిప్పు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

2018లో కేరళలోని పత్తనంతిట్టలో జశ్న అనే యువతి కనిపించకుండా పోయింది. ఆ సంఘటన మలయాళ ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ అమ్మాయికి ఏమైంది అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ సంఘటన అప్పటికీ, ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మాధ్యమాల్లో కూడా జశ్న గల్లంతైన విషయం గురించి విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సంఘటన ఆధారంగానే "ఆనంద్ శ్రీబాల" చిత్రం రూపుదిద్దుకుంది. జశ్న గల్లంతైన కథ ఆధారంగా ఫస్టాఫ్ రూపొందించబడింది. సెకండాఫ్ లో, కేరళలో జరిగిన మరికొన్ని క్రైమ్‌ సంఘటనల్ని కలగలిపి సినిమాటిక్‌గా కథగా ఈ సినిమాను తెరకెక్కించారు. మొదటి నుంచి చివరి వరుకూ సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ ఆడియన్స్ ను బాగా థ్రిల్ చేస్తుంది ఈ సినిమా.

Tags

Next Story