ఆహాలో వస్తోన్న ‘ఆనందలహరి’

X
ఓటీటీ ఆడియన్స్ కోసం కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. సినిమాలకు దీటుగా ఓటీటీలో సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఈకోవలోనే ఆహా వీడియో ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.
ఓటీటీ ఆడియన్స్ కోసం కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. సినిమాలకు దీటుగా ఓటీటీలో సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఈకోవలోనే ఆహా వీడియో ఓ రొమాంటిక్ కామెడీ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. ఈ సిరీస్ పేరు ‘ఆనందలహరి’. తూర్పు గోదావరి అబ్బాయి, పశ్చిమ గోదావరి అమ్మాయి ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఫన్ కలిసిన పాన్ గోదావరి లవ్ స్టోరీ ఇది.
లేటెస్ట్ గా రిలీజైన ఈ సిరీస్ ట్రైలర్ ఫుల్ ఫన్, ఫ్యామిలీ ఎమోషన్‌లతో ఆకట్టుకుంటోంది. కథలో ఆనంద్, లహరి అనే యువ జంట మధ్య జరిగే ఘర్షణలు, నవ్వులు, మనసు తాకే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ‘ఉద్యోగం వద్దన్న అబ్బాయి – ఉద్యోగం కోసం ఊరిని వదిలి వెళ్లాలనుకునే అమ్మాయి.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే?‘ అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ సాగనుంది. సాయి వానపల్లి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
Next Story
-
Home
-
Menu