ఓటీటీలోకి వచ్చేస్తున్న అఖిల్ ‘ఏజెంట్’!

X
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో భారీ అంచనాలతో విడుదలై 'ఏజెంట్' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా నెలలకు ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది 'ఏజెంట్'. మార్చి 14 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 'ఏజెంట్' అందుబాటులోకి రానుందట. మరోవైపు 'ఏజెంట్' తర్వాత అఖిల్ కూడా కొత్త సినిమాకోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా చేస్తున్నాడు.
Next Story
-
Home
-
Menu