ఈ వెబ్ సిరీస్ లో హీరోగా ఆదిత్యరాయ్ కపూర్ !

ఈ వెబ్ సిరీస్ లో హీరోగా ఆదిత్యరాయ్ కపూర్ !
X
తాజాగా ధర్మా కార్నర్‌స్టోన్ ఏజెన్సీ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ అప్‌డేట్‌ను ప్రకటించారు.

జాతీయస్థాయిలో విభిన్నమైన వెబ్‌సిరీస్‌లను రూపొందించిన ప్రతిష్టాత్మక దర్శక ద్వయం రాజ్ అండ్ డికే గతేడాది జూలైలో తమ కొత్త ఫాంటసీ సిరీస్ "రక్త బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్" ను ప్రకటించారు. తాజాగా.. ఈ భారీ ప్రాజెక్ట్‌లో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ వార్తతో ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. రాజ్ అండ్ డికే దర్శకత్వంలో పనిచేయడం ఓ అరుదైన అవకాశమని చెప్పారు.

తాజాగా ధర్మా కార్నర్‌స్టోన్ ఏజెన్సీ వారి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, రాజ్ అండ్ డికేల ఫోటోలు.. అలాగే అధికారిక ప్రకటన ఉన్నాయి. ‘రక్త బ్రహ్మాండ్’ లోని పాత్రకు బలమైన శక్తి, అగ్రెసివ్ నెస్, కొంత విభిన్నత అవసరం. ఇవన్నీ ఆదిత్య రాయ్ కపూర్‌లో ఉన్నాయి. ఈ పాత్ర కోసం ఆయన బాగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సిరీస్‌తో ఒక వినూత్నమైన ప్రపంచాన్ని సృష్టించడం, మన చిన్నప్పుడు విన్న ఫాంటసీ కథలను గుర్తు చేసేలా మలచడం మా లక్ష్యం" అని తెలిపారు.

ఫ్యామిలీ మాన్, గన్స్ అండ్ గులాబ్స్, ఫర్జీ వంటి హిట్ సిరీస్ లు అందించిన స్ట్రీమింగ్ కింగ్స్ రాజ్ అండ్ డికే.. తమ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రక్త బ్రహ్మాండం' యాక్షన్ ఫాంటసీ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌లో సమంత రూత్ ప్రభు, అలీ ఫజల్, వామికా గబ్బి ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags

Next Story