అదిరిపోయే ట్విస్టులతో మలయాళ థ్రిల్లర్ ... ఓటీటీలోకి వచ్చేస్తోంది!

అదిరిపోయే ట్విస్టులతో మలయాళ థ్రిల్లర్ ... ఓటీటీలోకి వచ్చేస్తోంది!
X

అదిరిపోయే ట్విస్టులతో మలయాళ థ్రిల్లర్ ... ఓటీటీలోకి వచ్చేస్తోంది!ఈ ఏడాది విడుదలైన మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రేఖాచిత్రం’. ఆద్యంతం ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నిండిపోయిన ఈ సినిమా మాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించింది. జోఫిన్ టి చాకో దీనికి దర్శకుడు. ఆసిఫ్ ఆలీ, అనస్వరా రాజన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది.

పోలీసు అధికారి వివేక్‌ గోపీనాథ్‌ (ఆసిఫ్‌ అలీ) జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. జూదం అలవాటు వల్ల ఉద్యోగం నుంచి తొలగించిన అతడిని, నిజాయితీ కారణంగా అధికారులు మళ్లీ విధుల్లోకి రప్పిస్తారు. విధుల్లో చేరిన అదే రోజున రాజేంద్రన్‌ (సిద్ధిక్‌) అనే వ్యక్తి అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంటాడు. విచారణ చేపట్టిన వివేక్‌.. ఈ ఘటన 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్యకేసుతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు.

తదుపరి దర్యాప్తులో అతడు మరిన్ని విషయాలు తెలుసుకొని షాకవుతాడు. ఓ ప్రదేశంలో మానవ పుర్రె, ఎముకలు బయటపడతాయి. ఇది మమ్ముట్టి నటించిన ‘కాతోడు కాతోరం’ చిత్ర షూటింగ్‌ స్థలంతో అనుసంధానం కావడం విచారణను మరింత ఆసక్తికరంగా మార్చుతుంది. ఇంతలో మమ్ముట్టి అభిమాని అయిన కథానాయిక రేఖ (అనస్వర రాజన్‌) అనుకోకుండా అదృశ్యమవుతుంది. ఒక పాత హత్య, ఒక తాజా ఆత్మహత్య, రేఖ మిస్సింగ్, ఈ మూడింటికీ మధ్య గల మిస్టరీ ఏమిటి? వీటన్నింటికీ పరిష్కారం ఎలా దొరికింది?

ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే, ‘రేఖా చిత్రం’ తప్పక చూడాల్సిందే. జనవరి 9న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌ మార్చి 7న సోనీ లివ్‌లో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. థ్రిల్లింగ్‌ కథలను ఇష్టపడే వారికి ఇది ఓ మిస్‌ కాకూడని సినిమా!

Tags

Next Story