ఓటీటీ లోకి వస్తోన్న ‘మదరాసి’

తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మదరాసి’. సెప్టెంబర్ 5న భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. సుమారు రూ.150 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.97.69 కోట్లు మాత్రమే రాబట్టింది.
ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘మదరాసి’ అక్టోబర్ 1 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. తమిళనాడులో గన్ కల్చర్‌ను స్థిరపరచాలనుకునే సిండికేట్.. విరాట్ (విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబీర్) అండతో ట్రక్కుల కొద్దీ ఆయుధాలను తరలిస్తుంది. ఈ ముఠాను ఆపాలని ఎన్ఐఏ ఆఫీసర్ ప్రేమ్ (బిజు మేనన్) ప్రయత్నిస్తాడు. మరోవైపు లవ్ ఫెయిల్యూర్‌తో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రఘురామ్ (శివకార్తికేయన్) ఈ మిషన్‌లో ఎలా భాగమయ్యాడు? ఆపరేషన్ విజయవంతమైందా? అనేది కథాంశం.
-
Home
-
Menu