‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ-రిలీజ్ టీజర్!

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ-రిలీజ్ టీజర్!
X
'కల్కి' చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ తీసిన తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇప్పుడు స్టార్స్‌గా చక్రం తిప్పుతున్న నాని, విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన సినిమా ఇది.

'కల్కి' చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న నాగ్ అశ్విన్ తీసిన తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇప్పుడు స్టార్స్‌గా చక్రం తిప్పుతున్న నాని, విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన సినిమా ఇది. పదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఓ మంచి సినిమాగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. మార్చి 21న మళ్లీ 'ఎవడే సుబ్రహ్మణ్యం' గ్రాండ్ లెవెల్ లో రీ-రిలీజవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రీ-రిలీజ్ టీజర్ ను విడుదల చేశారు. నాని, విజయ్ దేవరకొండ సీన్స్ హైలైట్ గా సాగిన ఈ టీజర్ రిఫ్రెషింగ్ గా ఆకట్టుకుంటుంది.

ఇక 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాని చూడాలనుకునే విద్యార్థుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది టీమ్. స్టూడెంట్స్ గ్రూప్ బుకింగ్ చేస్తే ఒక్కో టికెట్ కేవలం ₹100కి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. మొత్తంగా ఈ వారం 'పెళ్లి కాని ప్రసాద్, షణ్ముఖ' వంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' రీ-రిలీజ్ రూపంలో థియేటర్లలోకి వస్తోంది. మరి.. రీ-రిలీజ్ లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.



Tags

Next Story