నిన్న చాట్ జీపీటి.. నేడు గ్రోక్!

X
‘రాబిన్ హుడ్‘ ప్రచారం కోసం టెక్నాలజీని వీర లెవెల్ లో వాడుకుంటుంది టీమ్. ముఖ్యంగా హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల తమ చిత్రం ప్రచారాన్ని భుజానికెత్తుకుతున్నారు.
‘రాబిన్ హుడ్‘ ప్రచారం కోసం టెక్నాలజీని వీర లెవెల్ లో వాడుకుంటుంది టీమ్. ముఖ్యంగా హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల తమ చిత్రం ప్రచారాన్ని భుజానికెత్తుకుతున్నారు. గడిచిన కొన్ని రోజులుగా ‘రాబిన్ హుడ్‘ని ఓ రేంజులో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, మూడు పాటలు రాగా.. ఇప్పుడు ట్రైలర్ కి టైమ్ ఫిక్స్ అయ్యింది.
ఇటీవల ఈ సినిమా ప్రచారాన్ని ఎలా చేయాలి అని హీరో నితిన్ చాట్ జీపీటిని అడిగిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇప్పుడు తమ సినిమా ట్రైలర్ డేట్ కోసం మరో ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్‘ని అడుగుతున్న వీడియోని టీమ్ రిలీజ్ చేసింది. తమ సినిమాకోసం గ్రోక్ చెప్పినట్టుగా మార్చి 21న ట్రైలర్ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. మార్చి 28న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.
Next Story
-
Home
-
Menu