వెంకీమామ కొత్త చరిత్ర సృష్టిస్తాడా?

వెంకీమామ కొత్త చరిత్ర సృష్టిస్తాడా?
X
ఈ సంక్రాంతి పండుగను టాలీవుడ్ కి మరింత ప్రత్యేకంగా మార్చింది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది.

ఈ సంక్రాంతి పండుగను టాలీవుడ్ కి మరింత ప్రత్యేకంగా మార్చింది. 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తుంది. విడుదలైన ఐదో రోజులకే రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి ట్రేడ్ వర్గాలను సైతం షాక్‌కు గురి చేసింది.

ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన RRR తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' రెండవ స్థానంలో నిలిచింది. ఐదో రోజుకు తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల షేర్‌తో నాన్-RRR రికార్డు సెట్ చేసింది. ఈ వేగం చూస్తుంటే త్వరలోనే వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' రూ.200 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే ఈ మూవీ లాంగ్ రన్ లో రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా రిలీజ్ లేకుండానే ఈ రేంజులో వసూళ్లు సాధించడం అంటే గొప్ప విషయమే అవుతుంది.

Tags

Next Story