బ్లాక్‌బస్టర్ తర్వాత రిస్క్ ఎందుకు?

వెంకటేష్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, రూ. 300 కోట్ల వసూళ్లతో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ విజయం వెంకటేష్ మార్కెట్‌ను తిరిగి పుంజుకునేలా చేసింది. అందుకే అభిమానులు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ సమయంలో వెంకీ తన తర్వాతి సినిమాకోసం రిస్క్ తీసుకోబోతున్నాడా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
నెక్స్ట్ మూవీ కోసం వెంకటేష్ ఫైనలైజ్ చేయబోయే దర్శకుల లిస్టులో సురేందర్ రెడ్డి, వినాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఫ్లాపుల్లో ఉండడమే దగ్గుబాటి ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌కు పెట్టింది పేరు సురేందర్ రెడ్డి. కానీ అతని గత చిత్రం 'ఏజెంట్' తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే వెంకీకి 'లక్ష్మీ' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందించాడు వినాయక్. కానీ వినాయ్ లాస్ట్ మూవీ 'ఛత్రపతి' ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పటికీ వెంకటేష్ తన తర్వాతి చిత్రంపై అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఆయన అభిమానులు మాత్రం 'బ్లాక్‌బస్టర్ తర్వాత రిస్క్ అవసరమా?' అనే ప్రశ్నతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Home
-
Menu