'ఘాటి' విడుదల ఎప్పుడు?

తెలుగులో విలక్షణ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు క్రిష్. అయితే ఈమధ్య కాలంలో క్రిష్ వరుస ఎదురుదెబ్బలతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నా.. చేపట్టిన ప్రాజెక్ట్స్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తవ్వడం లేదు.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో అప్పట్లో 'మణికర్ణిక' అంటూ ఎంతో ప్రతిష్ఠాత్మక సినిమాని మొదలు పెట్టాడు. చాలా భాగం ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. కానీ మధ్యలో ఈ చిత్రాన్ని వదిలేసి రావాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగులో 'ఎన్టీఆర్ బయోపిక్' కోసమే 'మణికర్ణిక'ని వదులుకున్నాడు అనే ప్రచారం ఉంది.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో చారిత్రక నేపథ్యంలో 'హరహర వీరమల్లు'ని మొదలు పెట్టాడు. ఈ ప్రాజెక్ట్ కూడా సేమ్ టు సేమ్. తాను ఎంతో ప్రెస్టేజియస్ గా తీసుకున్న 'వీరమల్లు'ని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చిత్రం నుంచి తప్పుకున్న తర్వాత అనుష్క తో 'ఘాటి' మొదలు పెట్టాడు.
అసలు ఈ ఏప్రిల్ లోనే 'ఘాటి' విడుదల కావాల్సి ఉంది. కానీ.. కొంతకాలంగా ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. 'ఘాటి' సినిమా ప్రచారమే లేకపోవడం అభిమానుల్లో అయోమయాన్ని కలిగిస్తుంది. మరి.. 'ఘాటి' కొత్త విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
-
Home
-
Menu