'కుబేర' విలన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

నటుడిగా పేరు తెచ్చుకోవడం ఒక్కటే కాదు, ప్రామాణిక నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడం చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన నటుల్లో జిమ్ సర్బ్ ఒకడు. ‘కుబేర’ సినిమాలో నాగార్జున, ధనుష్ లాంటి స్టార్లకు సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న నటుడు జిమ్ సర్భ్.
1987లో ముంబైలో జన్మించిన జిమ్ సర్బ్, పార్సీ కుటుంబంలో పెరిగాడు. ఆయన విద్యాభ్యాసం యునైటెడ్ వరల్డ్ కాలేజ్ (పుణె) తర్వాత అట్లాంటాలోని జార్జియా విశ్వవిద్యాలయంలో జరిగింది. చదువులో టాపర్ అయిన జిమ్ ఎవరూ ఊహించని విధంగా నాటకాల మీద ఆసక్తి వల్ల మళ్లీ ఇండియాకి వచ్చి థియేటర్లో అడుగుపెట్టాడు.
జిమ్ మొదటగా థియేటర్ రంగంలో తన సత్తా చాటాడు. ‘డెత్ ఆఫ్ ఎ సేల్స్‌మన్, మక్బెత్, కోస్మోపాలిటన్’ వంటి నాటకాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, క్యారెక్టర్ డెప్త్ ఇవన్నీ తక్కువ సమయంలోనే జిమ్ కు నాటకాలలో ఓ ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టాయి.
జిమ్ సర్బ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టిన మొదటి చిత్రం 'నీర్జా'. 2016లో విడుదలైన ఈ సినిమాలో తను పోషించిన హైజాకర్ ఖలీద్ మహ్మద్ పాత్రతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ‘పద్మావత్, సంజు, గంటూబాయ్ కతియవాడి’ వంటి బ్లాక్ బస్టర్లు అతన్ని బిజీ నటుడిగా నిలిపాయి. మరోవైపు ‘మేడ్ ఇన్ హెవెన్, రాకెట్ బాయ్స్' వంటి వెబ్ సిరీస్ లలోనూ నటించాడు.
ఇక శేఖర్ కమ్ముల సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ పెద్దగా ఉండవు. కానీ ఈ చిత్రంలో నీరజ్ అనే పాత్ర ద్వారా ధనంతో పాటు అహంకారంతో నిండిన వ్యాపారవేత్తగా జిమ్ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 'కుబేర'లో జిమ్ క్యారెక్టర్ కి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. బాలీవుడ్ లో తన నటనతో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ విలక్షణ నటుడికి, ‘కుబేర’ విజయంతో రాబోయే రోజులలో సౌత్ లోనూ మరిన్ని అవకాశాలు రావొచ్చన్న నమ్మకం నెలకొంది.
-
Home
-
Menu