కళ్యాణ్ రామ్ నెక్స్ట్ స్టెప్ ఎటు?

కళ్యాణ్ రామ్ నెక్స్ట్ స్టెప్ ఎటు?
X
కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ కోసం పలు కథలు వింటున్నాడట. ఈ నేపథ్యంలో, ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో గుర్తింపు పొందిన గిరీశయ్య ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్టోరీతో కళ్యాణ్ రామ్‌ను సంప్రదించాడని తెలుస్తోంది.

ఇటీవలే ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా ద్వారా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాబట్టలేకపోయింది. ఈ ఫలితంతో కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు.

ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కళ్యాణ్ రామ్ నెక్స్ట్ మూవీ కోసం పలు కథలు వింటున్నాడట. ఈ నేపథ్యంలో, ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’తో గుర్తింపు పొందిన గిరీశయ్య ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్టోరీతో కళ్యాణ్ రామ్‌ను సంప్రదించాడని తెలుస్తోంది. తెలుగులోనూ మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ తెరకెక్కించాడు గిరీశయ్య.

మరోవైపు కళ్యాణ్ రామ్ కిట్టీలో ‘బింబిసార 2‘ కూడా ఉంది. ఈ చిత్రం కూడా ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. మొత్తంగా ‘అర్జున్ S/O వైజయంతి’ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ ఏంటి? అనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

Tags

Next Story