‘కర్తవ్యం’ వైజయంతికి కొడుకు ఉంటే?

‘కర్తవ్యం’ వైజయంతికి కొడుకు ఉంటే?
X
నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, కళ్యాణ్ రామ్ విజయశాంతిని తనకు ‘అమ్మ’లాంటి వ్యక్తిగా భావిస్తానని, ఈ చిత్రంతో తమ అనుబంధం మరింత గాఢమైందని తెలిపాడు.

‘అర్జున్ S/O వైజయంతి’ కథ విషయానికొస్తే, తల్లీకొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఈ సినిమాలో చిత్రీకరించారని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినప్పుడు, తల్లి పాత్రకు విజయశాంతిగారే సరైన ఎంపికగా అనిపించిందని, ఆమె కాకుండా ఆ పాత్రను ఇంకెవరు చేయలేరని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘కర్తవ్యం’ సినిమాలోని వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రూపుదిద్దుకుందన్నాడు.

సినిమాలో విజయశాంతి పోరాట సన్నివేశాల్లో తనదైన శైలి కనబరిచారని, ఈ సినిమా కథలో ఆమె ప్రధాన బలం కానున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈరోజు ఉదయం 10 గంటల 32 నిమిషాలకు 'అర్జున్ S/O వైజయంతి' టీజర్ రాబోతుంది.

Tags

Next Story