ప్రచార జోరు పెంచిన 'వార్ 2'

ప్రచార జోరు పెంచిన వార్ 2
X
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2'. సూపర్ హిట్ 'వార్'కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2'. సూపర్ హిట్ 'వార్'కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘ఊపిరి ఊయలగా’ అనే ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. ఈ పాటలో హృతిక్-కియారాల మధ్య రొమాంటిక్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్. ఇటలీలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ పాట విజువల్స్, మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తెలుగులో చంద్రబోస్ రాసిన లిరిక్స్‌కు, శశ్వత్ సింగ్, నిఖితా గాంధీ వాయిస్‌లు ప్రాణం పోశాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అయన్ ముఖర్జీ దర్శకుడు. త్వరలో ఈ మూవీ నుంచి తారక్-హృతిక్ కాంబోలో చిత్రీకరించిన డ్యాన్స్ నంబర్ కూడా రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో విడుదల చేయబోతుంది.



Tags

Next Story