‘వార్ 2‘ బాక్సాఫీస్ రిపోర్ట్

టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘వార్-2‘ ఆగస్టు 14న విడుదలైంది. ఇతర కీలక పాత్రల్లో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించింది.
2019లో వచ్చిన ‘వార్‘ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్‌కి ముందే భారీ హైప్ తెచ్చుకుంది. తొలి రోజు రూ.52.50 కోట్ల నెట్ కలెక్షన్లతో స్టార్ట్ కాగా, రెండో రోజూ రూ.56 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచే తొలి రోజే రూ.23.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించినా, తర్వాత రోజుల్లో కలెక్షన్లు పడిపోయాయి.
ఇప్పటివరకూ వరల్డ్‌వైడ్‌గా రూ.318 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అంటే షేర్ ఈ వసూళ్లలో సగంగా లెక్కించాలి. కానీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ.130 నుంచి రూ.140 కోట్ల షేర్ అవసరం ఉందట. తెలుగులోనూ 30 నుంచి 35 కోట్లు లాస్ అయ్యిందనే ప్రచారం జరుగుతుంది. మొత్తంగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్ తో పాటు.. ఇటు ఎన్టీఆర్ కెరీర్ లోనూ ‘వార్ 2‘ ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
-
Home
-
Menu