'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్

వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్
X
‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో విజయవాడ పటమట పోలీసులు ఆయనను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వివాదం నేపథ్యంలో విజయవాడ పటమట పోలీసులు ఆయనను హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు.

దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్.. ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆయన వద్ద కిరణ్‌ రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. గడువు ముగిసినా తిరిగి చెల్లించకపోవడంతో మహేష్ అనేకసార్లు డబ్బు ఇవ్వమని అడిగారు. అయినా స్పందించకపోవడంతో ఈ నెల 18న మహేష్, తన భార్యతో కలిసి విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది తమపై దాడి చేశారని మహేష్ దంపతులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్‌ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.

Tags

Next Story