మహాశివరాత్రికి ‘విశ్వంభర’ మ్యూజికల్ ట్రీట్?

చిరంజీవి నటించిన 'భోళా శంకర్' డిజాస్టర్ గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ 'విశ్వంభర' చిత్రంపైనే ఉన్నాయి. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. చిరంజీవి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తరహాలో భారీ సోషియో ఫాంటసీగా ‘విశ్వంభర’ రూపొందుతుంది.
విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుంది. 'స్టాలిన్' తర్వాత చిరు-త్రిష కాంబోలో వస్తోన్న మూవీ ఇది. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మెగాస్టార్ తో గతంలో 'ఘరానామొగుడు, ఆపద్భాంధవుడు' వంటి సూపర్ హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ అందించాడు కీరవాణి. చిరు-కీరవాణి కలయికలోనూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సెట్టైన కాంబో ఇది.
తాజాగా 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మహాశివరాత్రి కానుకగా ఈనెలలోనే 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సింగిల్ రానుందట. ఫస్ట్ సింగిల్ తో పాటు 'విశ్వంభర' రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇవ్వనుందట టీమ్.
-
Home
-
Menu