‘లైలా‘ ట్రైలర్.. ఆడవేషంలో అదరగొట్టిన విశ్వక్ సేన్!

ఫిబ్రవరి 14న ప్రేమికులరోజును టార్గెట్ చేస్తూ పలు చిత్రాలు బాక్సాఫీస్ కి క్యూ కడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది 'లైలా'. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ‘లైలా‘ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ విషయానికొస్తే.. పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయిన సోను (విశ్వక్ సేన్) వారి నుంచి తప్పించుకోవడానికి లైలాగా ఆడవేషంలోకి మారతాడు. ఇక అక్కడ్నుంచి లైలాగా విశ్వక్ చేసే రొమాంటిక్ అల్లరి ఓ రేంజులో ఉండబోతున్నట్టు ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. విశ్వక్ మార్క్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ భారీగానే ఉన్నాయి. సోనూ, లైలా గా రెండు పాత్రల్లోనూ విశ్వక్ సేన్ తనదైన స్వాగ్ తో ఆకట్టుకుంటున్నాడు. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రాన్ని రామ్ నారాయణ్ తెరకెక్కించాడు.
-
Home
-
Menu