‘థగ్ లైఫ్‘ నుంచి విశ్వద నాయకా!

విశ్వనటుడు కమల్ హాసన్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘థగ్ లైఫ్‘. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో కమల్ హాసన్ నటనతో పాటు స్టంట్స్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బట్టి తెలుస్తోంది. ఇక.. పాటలు కూడా మణిరత్నం స్టైల్ లో సరికొత్తగా ఉన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన ‘జింగూచా, సుగర్ బేబి‘ పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ‘విశ్వద నాయకా‘ అంటూ సాగే మరో గీతం విడుదలైంది.
ఈ సాంగ్ లో కమల్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఈ పాటలో అభిరామి, త్రిష తో కమల్ రొమాంటిక్ జర్నీని చూపించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతంలో అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్ ఆలపించారు. ఏ.ఆర్.అమీన్ ర్యాప్ ను పెర్ఫామ్ చేశాడు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది. జూన్ 5న ‘థగ్ లైఫ్‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.
-
Home
-
Menu