తెలుగులోకి వస్తున్న విశాల్ 'మదగజరాజ'

X
యాక్షన్ స్టార్ విశాల్ కోలీవుడ్ పొంగల్ రేజులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే విడుదలవ్వాల్సిన 'మదగజరాజ' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
యాక్షన్ స్టార్ విశాల్ కోలీవుడ్ పొంగల్ రేజులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే విడుదలవ్వాల్సిన 'మదగజరాజ' సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. విశాల్ సినిమాలు ఎప్పుడూ తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలవుతుంటాయి. అయితే ఈసారి తమిళంలో విజయం సాధించిన తర్వాత తెలుగులోకి వస్తోంది 'మదగజరాజ'.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సుందర్ సి దర్శకత్వంలో 'మదగజరాజ' తెరకెక్కింది. విశాల్ కి జోడీగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. సంతానం మరో కీ రోల్ లో కనిపించాడు. ఈ సినిమాకి హీరో విజయ్ ఆంటోని సంగీతాన్ని సమకూర్చాడు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన 'మదగజరాజ' జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి.. తెలుగులో కూడా 'మదగజరాజ' మంచి విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.
Next Story
-
Home
-
Menu