అమెరికా ప్రేమకథతో 'వీసా'

అమెరికా ప్రేమకథతో వీసా
X
మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వీసా' అంటే 'వింటారా సరదాగా' అనేది ఈ టైటిల్ కి ఫుల్ ఫామ్.

మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'వీసా' అంటే 'వింటారా సరదాగా' అనేది ఈ టైటిల్ కి ఫుల్ ఫామ్. ఈ సినిమాలో అశోక్ కి జోడీగా శ్రీ గౌరీ ప్రియ నటిస్తుంది. నూతన దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.

'ఆంధ్ర, తెలంగాణ తర్వాత మన తెలుగు వాళ్లకు కనెక్ట్ అయ్యే స్టేట్... యునైటెడ్ స్టేట్స్' అనే డైలాగ్‌ తో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అమెరికాలో చదువుల కోసం వెళ్లిన తెలుగు యువత జీవితం, స్నేహం, ప్రేమ, ఎదురయ్యే సవాళ్లు అనే అంశాలపై ఈ సినిమా కథ సాగనున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. టీజర్ చూస్తే ఇది పూర్తిగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అని స్పష్టమవుతోంది.

టీజర్‌కు మరో మెయిన్ హైలైట్‌గా విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిలిచింది. ఇక గత సినిమాతో పోలిస్తే గల్లా అశోక్ లుక్, బాడీ లాంగ్వేజ్ మెరుగైంది. అతనిలో మంచి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తోంది. ఈ మూవీలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags

Next Story