'96' డైరెక్టర్ తో విక్రమ్!

96 డైరెక్టర్ తో విక్రమ్!
X
తమిళ స్టార్ హీరో విక్రమ్ తన 64వ సినిమాకు శ్రీకారం చుట్టాడు. '96, సత్యం సుందరం' ఫేమ్ ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

తమిళ స్టార్ హీరో విక్రమ్ తన 64వ సినిమాకు శ్రీకారం చుట్టాడు. '96, సత్యం సుందరం' ఫేమ్ ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె.గణేష్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటివరకు ఎమోషనల్ డ్రామాలకు పేరుగాంచిన ప్రేమ్ కుమార్ విక్రమ్ చిత్రాన్ని ఓ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నాడట. విక్రమ్ గత చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’ విమర్శకుల ప్రశంసలతో పాటు తమిళనాట మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విక్రమ్ ‘మండేలా, మావీరన్’ డైరెక్టర్ మడోన్ అశ్విన్ తో తన 63వ సినిమా చేస్తున్నాడు.

Tags

Next Story